|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 06:56 PM
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలో భారత్-పాకిస్తాన్ మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కి ముందు, టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను తక్కువగా అంచనా వేయవద్దని భారత జట్టును హెచ్చరించారు. ఇలాంటి సమయంలో జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్ లో ఈ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ పాత్ర కీలకంగా మారింది. దీంతో భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ భారత బ్యాట్స్ మెన్ కు ఓ కీలక హెచ్చరిక చేశాడు. రాంచీలో మీడియాతో మాట్లాడిన హర్భజన్.. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని, అయితే పాకిస్థాన్‌లో ఒక స్పిన్నర్ (ఉస్మాన్ తారిక్) ఉన్నాడని, అతను మంచి స్పిన్నర్ అని చెప్పుకొచ్చాడు. మనం అతన్ని జాగ్రత్తా ఆడాల్సి ఉంటుందన్నాడు. భారత జట్టుకు సమర్ధత ఉందని, ఇది చాలా మంచి జట్టు అని,వారు ఎప్పుడూ ఆడిన విధంగానే ఆడతారని, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడతారని, విజయపతాకం ఎగురవేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
Latest News