|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 06:44 PM
విటమిన్ డి లోపం ఎముకల ఆరోగ్యానికి హానికరం. అయితే, విటమిన్ డి టాబ్లెట్లను వైద్యుల సలహా లేకుండా అధికంగా వాడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, ఈ టాబ్లెట్లను అతిగా వాడటం వల్ల శరీరంలో కాల్షియం పెరిగి కిడ్నీలు దెబ్బతిని, డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని వారు తెలిపారు. విటమిన్ డి టాబ్లెట్లను వైద్యుల సూచన మేరకు, నిర్దేశిత మోతాదులో మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.విటమిన్ డి లోపం ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు వారానికి 60వేల యూనిట్ల కెపాసిటీ ఉండే ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. విటమిన్ డి ని రోజువారీగా వాడాల్సి వస్తే.. గరిష్టంగా 2000 యూనిట్ల కెపాసిటీ ఉన్న ట్యాబ్లెట్ చాలు. ఇవి కూడా లోపం ఉంటేనే వాడాలి. కానీ కొందరు వీటిని అతిగా వాడుతున్నారు. దీంతో విటమిన్ డి శరీరంలో ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. శరీరంలోని కొవ్వులో కరిగి నిల్వ ఉంటుంది. మనం విటమిన్ డి ట్యాబ్లెట్లను మోతాదుకు మించి వేసుకుంటే.. మన శరీరంలోని కొవ్వులో ఆ విటమిన్ అధికంగా చేరుతుంది. అందులో నుంచి శరీరం తనకు కావల్సినంత వాడుకున్నా ఇంకా ఎక్కువగానే మిగిలిపోతుంది. ఇది బయటకు వెళ్లదు. దీంతో శరీరంలో కాల్షియం పెరిగిపోతుంది. శరీరంలో కాల్షియం పెరిగితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. దీంతో కిడ్నీలు చెడిపోతాయి.
Latest News