|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 07:09 PM
వేదాలు శివుడిని విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్య్రంబకుడు, త్రిపురాంతకుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సదాశివుడు అని స్తుతించాయి. మహాదేవుని మహత్త్వాన్ని సంపూర్ణంగా చెప్పడానికి మాటలు చాలవని మహాకవులు, సరస్వతి దేవికి కూడా ఎన్నో సన్నాహాలు అవసరమవుతాయని 'శివ మహిమ్నస్త్రోత్రం' పేర్కొంది. అయితే, శివుడు ఎంతటి మహిమాన్వితుడో అంతటి కరుణామయుడు, ఆడంబర విరహితుడు. ఆయన అనుగ్రహం పొందడానికి విస్తృతమైన పూజావిధులు, విలువైన సామగ్రీ అక్కర్లేదు. 'కాళహస్తీశ్వర శతకం' ప్రకారం, పుడిసెడు నీళ్ళు, ఒక్క పుష్పం, నిశ్చలమైన భక్తి భావంతో పూజ చేస్తే చాలు, భక్తుడు ధన్యుడై శివ సాక్షాత్కారం పొందుతాడని పండితులు వివరిస్తున్నారు.
Latest News