|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 12:11 PM
మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు. అటవీ ప్రాంతం సమీపంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Latest News