|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:16 PM
స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ ఛైర్మన్, వైయస్ఆర్‌సీపీ నేత కొండూరు అజయ్ రెడ్డి (రైల్వే కోడూరు) కుమారుడి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.నెల్లూరు నగరంలోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ మహోత్సవంలో నూతన వధూవరులు సిద్ధు – సుష్మా, ప్రతుల్య రెడ్డిలను ఆయన ఆశీర్వదించారు. దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
Latest News