|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:20 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలల్లోనే 61 డయేరియా ప్రబలిన ఘటనలు జరిగితే అందులో 35 ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో చోటుచేసుకోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాపోయారు. ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా రాష్ట్రంలో రోజూ ఏదొక ప్రాంతంలో అమాయకలు బలైపోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. శ్రీకాకుళం నగరంలోని ప్రజలంతా వాంతులు, విరేచనాలతో అల్లాడిపోతున్నారు. ఇప్పటికే నలుగురు చనిపోయారు. వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. కలుషిత నీటి సరఫరా కారణంగానే చనిపోయినట్లు మృతుల కుటుంబ సభ్యులు, వైద్యులు చెబుతుంటే, ప్రభుత్వం మాత్రం వేరే కారణాలతో చనిపోయారని చెప్పి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు. తాగునీటి సరఫరా చేసే ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు ఇష్టారాజ్యంగా అనుమతులివ్వడమే ఈ ప్రమాదాలకు అసలు కారణం. సురక్షితమైన తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం దౌర్భాగ్యం. చివరకు శ్రీకాకుళం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మందు బిళ్లకి దిక్కులేదు అని మండిపడ్డారు.
Latest News