|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:24 PM
శాసనమండలిలో ఆడబిడ్డ నిధి పథకం పై చర్చ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇచ్చిన సమాధానం పొంతనలేనిదిగా ఉందంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ఆడబిడ్డ నిధి అంశం కాకుండా ఇతర విషయాలపై మాట్లాడటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ, ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అని గుర్తు చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, అంటే ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని పేర్కొన్నారు. భారీగా ప్రకటనలు ఇచ్చినా, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆడబిడ్డ నిధి పథకం అమలు ఊసే లేకపోవడంపై ప్రశ్నించారు.
Latest News