|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:25 PM
శ్రీకాకుళం మున్సిపాలిటీని ఒక ప్రైవేట్ వ్యవస్థగా మార్చేశారు అని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నిర్వాకాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని వెంటబడి తరిమే రోజు తొందర్లోనే వస్తుంది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రాధాన్య రంగంగా భావించి అభివృద్ధి చేసిన వైద్యారోగ్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటోంది. చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఈ సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంటే దాన్ని డైవర్ట్ చేసే కుట్ర చేస్తున్నారు. అమరావతిలో మోటర్లతో నీరు తోడటానికి చేసే ఖర్చు నగరాల్లో రక్షిత తాగునీరు అందించడానికి వెచ్చించడం లేదు. డయేరియాతో చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. తక్షణమే ఆ కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేసారు.
Latest News