|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:37 PM
ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మావోయిస్టు పార్టీలో సంచలన ఘటన చోటుచేసుకుంది. రూ.22 లక్షల రివార్డు కలిగిన కమాండర్ అన్వేష్ అలియాస్ రేణును, పోలీసులకు లొంగిపోవాలని భావిస్తున్నాడనే కారణంతో అతని తోటి అగ్రనేత సుక్రు దారుణంగా హత్య చేశాడు. జనవరి 29న ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం అన్వేష్ మృతదేహాన్ని దారింగ్‌బాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పకారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పాతిపెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బుధవారం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో కుళ్లిపోయిన అన్వేష్ మృతదేహాన్ని వెలికితీశారు.
Latest News