|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:01 PM
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ ఒక శుభవార్త చెప్పింది. హుండీలో కానుకలు సమర్పించేందుకు నగదు లేదా చిల్లర అందుబాటులో లేని ఇబ్బందులకు చెక్ పెడుతూ 'శ్రీవారి ముడుపు పత్రం' పేరుతో ఒక వినూత్న విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్ చెల్లింపులు పెరిగిన ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.ఈ విధానంలో భాగంగా, తిరుపతి, తిరుమలలోని కీలక ప్రాంతాల్లో టీటీడీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తుంది. భక్తులు ఈ కౌంటర్ల వద్ద తమ స్తోమతను బట్టి రూ.100 నుంచి రూ.లక్ష వరకు యూపీఐ (ఫోన్‌పే, జీపే), క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత, భక్తులకు ఒక 'ముడుపు పత్రం' అందజేస్తారు. ఈ పత్రాన్ని భక్తులు గర్భాలయం వెలుపల ఉన్న శ్రీవారి హుండీలో వేసి తమ మొక్కును చెల్లించుకోవచ్చు.
Latest News