|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 11:19 AM
AP: తూర్పు గోదావరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. రాయవరం డిప్యూటీ తహసీల్దార్ సంధ్య (40), ద్వారపూడికి చెందిన సూర్య ప్రకాశ్ (41) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నిన్న వీరిద్దరు అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం నచ్చకపోవడంతో సంధ్య సోదరులు సూర్యప్రకాశ్‌ను రాళ్లతో కొట్టి చంపేశారు. స్థానికులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
Latest News