|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 11:20 AM
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట సమీపంలోని కూచవరం అడ్డరోడ్డు వద్ద గల పంట పొలాలలో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో స్థానికులు వెంటనే కొల్లిపర పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అది ఎవరిది అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
Latest News