|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 02:27 PM
ఏపీ శాసనమండలిలో తాను చూపిన స్టేట్‌మెంట్ నిజం కాదని మండలి ఛైర్మన్ ఎలా చెబుతారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయాలు కేబినెట్ సెక్రటరీ పేరిట, రాష్ట్ర ప్రభుత్వ సమాచారం సీఎస్ పేరిట, అసెంబ్లీ సమాచారం సెక్రటరీ జనరల్ పేరిట వస్తాయని ఆయన తెలిపారు. మండలి కార్యాలయం నుంచి వెళ్లిన లేఖను మండలి ఛైర్మన్ నిర్ణయంగానే పరిగణించకుండా ఎలా ఉంటామని ఆయన అన్నారు.ఈ రోజు శాసనమండలిలో వైకాపా సభ్యుల అసలు రూపం బయటపడింది. వారు సభకు వచ్చి, బట్టకాల్చి ముఖాన వేసి, వెళ్లిపోవాలన్న ధోరణిని అనుసరిస్తున్నారు. వాస్తవాలు కళ్లముందు కనబడుతుంటే తట్టుకోలేక వైకాపా సభ్యులు అల్లరి చేసి వెళ్లిపోతున్నారు. వైకాపా వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిపోయింది. ఆ పార్టీ నిజస్వరూపం రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయింది. రాయలసీమ ఎత్తిపోతలపై మండలిలో ప్రశ్న వేసి చివరకు వైకాపానే ఇరకాటంలో పడింది. 2020లో వైకాపా హయాంలో ఆగిపోయిన ప్రాజెక్టుకూ, మాకూ లింకు పెట్టాలని చూశారు. కానీ జలవనరులశాఖ మంత్రి చెప్పిన సమాధానంతో ఆ పార్టీ సభ్యులు విలవిల్లాడిపోయారు’ అని కేశవ్ ఎద్దేవా చేశారు.
Latest News