|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 02:30 PM
పాలలో కల్తీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. స్వచ్ఛమైన పాలు మృదువైన ఉపరితలంపై మందంగా ప్రవహిస్తే, నీరు కలిపిన పాలు త్వరగా పారిపోతాయని తెలిపారు. అయోడిన్ వేసినప్పుడు నీలం రంగు మారితే స్టార్చ్ కల్తీగా భావించవచ్చని పేర్కొన్నారు. బలంగా షేక్ చేసినప్పుడు అధిక నురుగు వస్తే డిటర్జెంట్ ఉండే అవకాశం ఉందన్నారు. రుచి, వాసనలో మార్పు ఉంటే జాగ్రత్తగా ఉండాలని, అనుమానం ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని FSSAI అధికారులు సూచించారు.
Latest News