|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 02:58 PM
కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబసభ్యులకు గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సమావేశం పూర్తిస్థాయి రాజకీయాలకు దూరంగా, ఒక ఫ్యామిలీ గెట్-టుగెదర్‌ను తలపించింది. రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా, పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విందు సమావేశం జరిగింది.ఈ సందర్భంగా నేతల కుటుంబసభ్యులు ఒకరికొకరు పరిచయం చేసుకుని, సరదాగా ముచ్చటించారు. మంత్రి లోకేశ్ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి, వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. "పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడ సెటిల్ అయ్యారు?" అంటూ ఆప్యాయంగా వాకబు చేశారు. ఈ క్రమంలో ఆయన సరదాగా మాట్లాడుతూ.. అబ్బాయిలకు 25 ఏళ్లకే పెళ్లి చేయాలని, తనకు 24 ఏళ్లకే వివాహమైందని గుర్తుచేసుకున్నారు. తన కుమారుడు దేవాన్ష్‌కు కూడా 25 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని ఇప్పటి నుంచే ట్యూన్ చేస్తున్నానంటూ నవ్వులు పూయించారు.
Latest News