గోదావరి పుష్కరాలపై కమిటీ నియామకం
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 02:59 PM

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పుష్కరాలకు సుమారు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిన్న సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కందుల దుర్గేశ్, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను ఆరు జిల్లాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరిన్ని నిర్మించి, మొత్తం 369 స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాల్లో ఈ ఏర్పాట్లు జరగనున్నాయి.భక్తుల కోసం సాధారణ ధరలకే టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ నిర్ణయించింది.

Latest News
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM
T20 WC: Sikandar Raza's superb 73 carries Zimbabwe to 153/7 against South Africa Sun, Mar 01, 2026, 05:08 PM
Protests erupt in Hyderabad over Khamenei's killing Sun, Mar 01, 2026, 05:03 PM
Israel-US attack on Iran: Karnataka Deputy CM condemns strikes on school Sun, Mar 01, 2026, 04:51 PM
Muslim clerics condemn killing of Khamenei, call for peace Sun, Mar 01, 2026, 03:41 PM