|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 11:45 AM
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మార్చి 26న ప్రారంభం కావాల్సిన 19వ సీజన్, రెండు రోజులు ఆలస్యంగా మార్చి 28న ప్రారంభమై మే 31న ముగియనుంది. పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా పూర్తి షెడ్యూల్ విడుదల ఆలస్యమవుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోవడంతో మ్యాచ్‌ల షెడ్యూల్‌పై ప్రభావం పడింది. ఆర్సీబీ హోమ్ మ్యాచ్‌లను బెంగళూరు వెలుపల నిర్వహించే అవకాశాలపై బీసీసీఐ పరిశీలిస్తోంది. నవీ ముంబై, రాయ్‌పూర్, పుణే నగరాలను ప్రత్యామ్నాయ వేదికలుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Latest News