|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 11:48 AM
ప్రకాశం జిల్లా కొండపి మండలం చిన్న వెంకన్న పాలెం లో రాష్ట్ర మారీ టైం బోర్డు చైర్మన్ దాంచర్ల సత్య ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెన్షన్లు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు పంపిణీ కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. సంబంధిత సిబ్బంది ఇండ్లకు వెళ్లి ఉదయాన్నే పెన్షన్లు అందించడం హర్షించదగ్గ విషయం అన్నారు. సామాజిక భద్రత పెన్షన్లను నాలుగు వేల రూపాయలు చంద్రబాబు చేయటం పేదలకు వరమని తెలిపారు.
Latest News