|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:11 PM
గుడివాడ పట్టణంలో శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఆయన పింఛన్ నగదును పంపిణీ చేశారు. నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు.
Latest News