|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:29 PM
హిందూ మతానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నాడని, తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కులం, మతం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేయడం హేయమని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేవ దేవుడి ప్రసాదం మీద విష ప్రచారం చేస్తూ హిందూ మత విశ్వాసాలను నాశనం చేస్తున్న చంద్రబాబుకి దేవుడంటే భయం కానీ, భక్తి కానీ లేనే లేవని.. భయభక్తులు ఉన్నవారు ఇంత నీచంగా తిరుమల లడ్డూ ప్రసాదం గురించి విష ప్రచారం చేయరని మండిపడ్డారు. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఉన్నాదిలా మారిపోయి కుల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని చెప్పారు. తాను చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసే వైవీ సుబ్బారెడ్డి, భూమన కుటుంబాలపై క్రిస్టియన్ ఆరోపణలు చేశాడని నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.
Latest News