|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:33 PM
రాజకీయ స్వార్థం కోసం తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా చంద్రబాబు చేసిన ఆరోపణలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తీవ్రంగా ఖంగిస్తున్నారు అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ... ఎవరైనా ఆరోపణలు చేస్తే, లేదా అనుమానాలు వ్యక్తం చేస్తే నివృత్తి చేయాల్సిన చంద్రబాబే టీటీడీపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఆర్థిక ప్రయోజానాలను ఆశించి ఇందాపూర్ డెయిరీ ముసుగులో టీటీడీ సొమ్మును హెరిటేజ్‌కి దోచిపెట్టాడు. హెరిటేజ్ అవినీతికి సంబంధించి ఆధారాలు బయటకు రావడంతో సమాధానం చెప్పుకోలేక కూటమి పారిపోతోంది. మండలిలో చర్చకు భయపడి పోతోంది. షార్ట్ డిస్కషన్‌లో మా సభ్యులు మాట్లాడటం మొదలు పెట్టగానే మంత్రి స్టేట్ ఇవ్వడం సభా సాంప్రదాయాలకు విరుద్ధం. మండలి చైర్మన్‌ను అగౌరవ పరిచేలా అధికార పార్టీ సభ్యులు వ్యవహరించారు. చర్చకు మేం పట్టుబడితే బయట మాత్రం మేం పారిపోతున్నాంటూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా మండలిలో మూడు గంటలపాటు నిరసన తెలియజేశాం. కానీ ప్రభుత్వమే ముందుకు రాలేదు. శ్రీవారి ప్రతిష్టను కాపాడటానికి వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుంది అని హెచ్చరించారు.
Latest News