|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:34 PM
తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో సీఎం చంద్రబాబు ఆటలాడుకుంటున్నాడు అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఆరోపించారు. అయన మాట్లాడుతూ... నెయ్యి కల్తీ పేరుతో చంద్రబాబు చేసిన కుట్రలన్నీ హెరిటేజ్ కి టీటీడీ నిధులు దోచిపెట్టడం కోసమేనని తేలిపోయింది. సభ సాక్షిగా ఆధారాలను బయటపెడుతుంటే కూటమి సభ్యులు ఓర్వలేకపోతున్నారు. చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారు. బీఏసీ సమావేశంలో ఒకలా సభలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైయస్ఆర్‌సీపీప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రభుత్వం భయంతో పారిపోతోంది. శ్రీవారి భక్తులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసారు.
Latest News