|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:39 PM
వ్యవసాయం మీద శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగం చేసి సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, అందులో వ్యవసాయ విధానాలపై కానీ, మార్కెటింగ్ పై కానీ, రైతుల సంక్షేమం పై కానీ ప్రస్తావన లేకపోవడమే ఇందుకు నిదర్శనమని వ్యవసాయశాఖ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులకు ఏం చేశారో చెప్పుకోలేక, కోకో సిటీ, అరకు కాఫీ అంటూ వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రైతులు ఎక్కువ కౌలు చేసేస్తున్నారని చంద్రబాబు చెప్పడం ఆయన అవగాహన లేమికి నిదర్శమని కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు ఏమీ చేయలేకపోయినట్లు చంద్రబాబు శుక్రవారం ఒప్పుకున్నారని కన్నబాబు తెలిపారు.ఈ రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేదని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నట్లయింది. ఒక మార్కెటింగ్ గురించి కానీ, రైతు సంక్షేమం గురించి కానీ, ఓ సౌకర్యం కల్పించామని గానీ చెప్పలేకపోయారు. గతేడాది చంద్రబాబు ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 393 మంది రైతులు, 2472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఏ స్థాయికి వ్యవసాయం దిగజారిందో అర్దం చేసుకోవచ్చు. ఇంత దుర్మార్గంగా వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసి కోకూ సిటీ తెస్తా, వాణిజ్య పంటలే పండించండని చంద్రబాబు చెప్తున్నాడు. చంద్రబాబు తన ప్రసంగంలో ఒక్క ముక్క వరి రైతుల గురించి మాట్లాడలేదు. తన వ్యవసాయ విధానం ఇదీ, మార్కెటింగ్ విధానం ఇదీ అని చెప్పుకోలేకపోయారు. రైతు ఆత్మహత్యలు ఆపడానికి మా పాలసీ ఇది అని చెప్పలేకపోయారు. ఇది మీ వైఫల్యమా కాదా చంద్రబాబు సూటిగా చెప్పాలి అని సూటిగా ప్రశ్నించారు.
Latest News