|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:38 PM
తిరుమల లడ్డూ వ్యవహారంలో చర్చ జరపాలని వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మాణాలను ప్రభుత్వం తిరస్కరిస్తూనే ఉంది వైసీపీ మహిళా నేత ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి అన్నారు. అయినా పట్టువదలకుండా పోరాటం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి చర్చకు బీఏసీలో అంగీకరించింది. కానీ సభలో మాత్రం చర్చ జరగకుండా గందరగోళం సష్టిస్తోంది. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందా లేదా సమాధానం చెప్పాలి? శాసనసభ వ్యవహారాలు చూసే మంత్రి పయ్యావుల కేశవ్ సభను తప్పుదోవ పట్టిస్తున్నాడు. లఘు చర్చలో స్టేట్ మెంట్ ఇవ్వడం అనేది సభాసాంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. చంద్రబాబు అవినీతి బయటపడిపోతుందనే భయంతోనే ప్రభుత్వం భయపడిపోతోంది అని తెలిపారు.
Latest News