|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:37 PM
పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ గురించి చేయకూడని ప్రచారం చేసింది కాకుండా ఆధారాలు బయటపడేసరికి మాట మార్చేస్తున్నారు అని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణం అన్నారు. అయన మాట్లాడుతూ... ఎవరో చెప్పారు, పేపర్లో వచ్చింది అని అధికారంలో ఉన్నత స్థానంలో ఉన్న నాయకులు మాట్లాడటం తప్పు. చేసిన తప్పుని అంగీకరించి శ్రీవారి భక్తులను క్షమాపణలు కోరాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మతాన్ని రాజకీయాల్లోకి లాగి దేవుళ్లను అవమానిస్తున్నారు. మార్చి 4వ తేదీన జరిగే చర్చలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం అని హెచ్చరించారు.
Latest News