|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:43 PM
వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్‌సీపీ నేత జ్వాలాపురం శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కనీసం పూజా విధానాల పట్ల అవగాహన లేని బుచ్చి రాంప్రసాద్ ఏ అర్హతతో వైయస్ జగన్ ని విమర్శిస్తున్నారని శ్రీకాంత్ ప్రశ్నించారు. పదవుల కోసం క్షుద్రపూజలు చేసే వారి పక్కన నిలబడే రాంప్రసాద్, బ్రాహ్మణత్వానికే కళంకం తెస్తున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ హయాంలో కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన క్షుద్రపూజల ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పులివెందుల లోని నందీశ్వర ఆలయంలో వైయస్ జగన్ హోమంలో పాల్గొనడాన్ని తప్పుబట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్.జగన్ అత్యంత నిష్ఠతో, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారని తెలిపారు. యాగానికి దుష్ట శక్తులు అడ్డురాకుండా ఉండాలని కోరుకుంటూ అక్షింతలు వాసన చూసి వెనక్కి వేస్తారని, ఇది తెలియకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. మరోవైపు హోమంలో కార్యవాది అయిన ఆలయ చైర్మన్ లేదా పాలకమండలి సభ్యులు మాత్రమే సతీసమేతంగా కూర్చుంటారనే కనీస జ్ఞానం కూడా విమర్శించే వారికి లేదని మండిపడ్డారు.
Latest News