|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 02:30 PM
విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మహిళా కార్పొరేటర్లు తమకు స్పోర్ట్స్ మీట్ బదులుగా విహారయాత్రకు (టూర్) వెళ్లే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ కాలపరిమితి ముగుస్తున్న తరుణంలో మేయర్ పీలా శ్రీనివాస్ ప్రతిపాదించిన స్పోర్ట్స్ మీట్‌ను మహిళా సభ్యులు వ్యతిరేకించారు. పార్టీలకు అతీతంగా ఏకమైన వారు, తమకు ఆటల పోటీలు అవసరం లేదని, అందరినీ టూర్‌కు తీసుకువెళ్లాలని కోరారు. మేయర్, కమిషనర్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో మహిళా కార్పొరేటర్లు పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపారు.
Latest News