|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:18 PM
రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో అస్వస్థతకు గురైన 15 మందికి వైద్యం కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రస్తుతం 11 మందికి వెంటిలేటర్ పై డయాలసిస్ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బాధితుల వైద్యానికి ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఉత్తమ వైద్యం అందించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
Latest News