|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 08:54 PM
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా కీలక ‘డూ ఆర్ డై’ పోరుకు సిద్ధమైంది. సూపర్-8 దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా నేటి (ఆదివారం) రాత్రి కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌ను భారత్ ఢీకొననుంది.ఈ మ్యాచ్ ఇరు జట్లకు క్వార్టర్ ఫైనల్‌తో సమానం. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు అడుగుపెడితే.. ఓడిన జట్టు టోర్నీకి గుడ్‌బై చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈ పోరుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
*భారత్‌ను ఓడించిన చివరి జట్టు : టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం ఇరు జట్లు పరస్పరం తలపడలేదు. 2023 ఆగస్టులో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌ను ఓడించిన ఏకైక జట్టు వెస్టిండీస్. ఆ సిరీస్ తర్వాత టీమిండియా ఒక్క టీ20 సిరీస్ కూడా కోల్పోలేదు. గత మూడేళ్లలో ఇరు జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్ మరింత బలంగా తయారవగా.. విండీస్ కూడా పటిష్ట కాంబినేషన్‌ను ఏర్పరుచుకుంది. ఈ టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా విండీస్ ముందంజలో ఉండగా.. భారత్ కేవలం మూడు సిక్స్‌ల తేడాతో రెండో స్థానంలో నిలిచిందిబలాబలాల పరంగా చూస్తే టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. మిస్టరీ స్పిన్‌తో పాటు నాణ్యమైన పేస్ దళం భారత్‌కు అదనపు బలం. అయితే తమ రోజు వస్తే విండీస్‌ను ఆపడం ఏ జట్టుకైనా సవాలే.
*విన్నింగ్ కాంబినేషన్ కొనసాగింపు : ఈ కీలక మ్యాచ్‌లో భారత్ మార్పులు లేకుండా అదే కాంబినేషన్‌తో ఆడే అవకాశముంది. ప్రత్యర్థి ఆఫ్‌స్పిన్‌ను ఎదుర్కొనే వ్యూహంగా సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా పంపిన ప్లాన్ సక్సెస్ అయింది. దీంతో సంజూ, అభిషేక్ శర్మ ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్‌ను బలపరుస్తారు.జింబాబ్వే మ్యాచ్ తరహాలో టాప్-ఆర్డర్ రాణిస్తే టీమిండియాను ఆపడం కష్టం. లోయర్ ఆర్డర్‌లో శివమ్ దూబే, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించనున్నారు. బౌలింగ్‌లో ఆశించిన ఫలితం ఇవ్వకపోతే దూబే స్థానంలో రింకూ సింగ్‌కు అవకాశం కల్పించే చాన్స్ ఉన్నా.. మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకునే అవకాశాలు తక్కువే.బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా సూపర్ ఫామ్ భారత్‌కు ప్రధాన బలం. అతనితో పాటు అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్‌లతో కూడిన దాడి విండీస్ బ్యాటర్లకు కఠిన పరీక్షే. ఇతర కాంబినేషన్లలో పెద్ద మార్పులు కనిపించవు. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది.
*భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా.