|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 01:18 PM
‘‘నన్ను 100 సార్లు జైలుకు పంపినా.. నాపై 1000 కేసులు పెట్టినా.. మా ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదు’’ అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జనసేన ఆఫీసులో రెండు వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో పరుగులు తీసుకుంటూ వెళ్లి విచారించిన గుంటూరు ఎస్పీ, ఐజీ.. మా ఇంటి పై ఏడు గంటల పాటు దాడి జరిగితే స్పందించలేదంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే మా ఇంటి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే మా ఇంటిపై దాడిలో ఆయన ప్రోద్బలం ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. మా ఇంటి పై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపరంగా పోరాడతాం. లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు.
Latest News