|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 02:16 PM
ఇరాన్ షియా పాలనలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశాన్ని 36 ఏళ్లుగా ఉక్కుపిడికిలితో ఏలిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (86) శకం ముగిసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపుదాడిలో ఆయన హతమయ్యారు. ఈ వార్త పశ్చిమాసియాలో కార్చిచ్చులా వ్యాపించగా, ఇరాన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రతీకారంతో రగిలిపోతుంటే, మరోవైపు ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఘటనతో యావత్ పశ్చిమాసియా యుద్ధ మేఘాల నీడలోకి జారుకుంది.ఖమేనీ మరణవార్తను ధ్రువీకరించిన వెంటనే, టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్, కరాజ్ వంటి ప్రధాన నగరాల్లో అసాధారణ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రభుత్వ ఆంక్షలను, ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను సైతం లెక్కచేయకుండా వేలాది మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొందరు భవనాలపైకి ఎక్కి ఆనందంతో కేరింతలు కొట్టగా, మరికొందరు వీధుల్లో నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ తమ స్వేచ్ఛను ప్రకటించుకున్నారు. "నియంతృత్వ పాలన అంతమైంది" అంటూ నినాదాలు చేశారు.
Latest News