|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 02:16 PM
పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం ప్రతీకార దాడులకు దిగడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ గనుక దాడులు కొనసాగిస్తే, ఆ దేశం ‘‘చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని’’ భయంకరమైన దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఖమేనీ మరణానికి ప్రతీకారంగా భారీ ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో స్పందించారు. ‘‘ఇరాన్ ఈరోజు మునుపెన్నడూ లేనంత గట్టిగా కొడతామని చెబుతోంది. వారు ఆ పని చేయకపోవడమే మంచిది. ఒకవేళ వారు గనుక సాహసిస్తే, మేము వారిపై ప్రయోగించే శక్తి ప్రపంచం ఇప్పటివరకు చూడని రీతిలో ఉంటుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు.
Latest News