|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 02:25 PM
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నితీశ్ కుమార్ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని చంద్రబాబు ఆదివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. ‘బీహార్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ప్రజాసేవలో దీర్ఘకాలం కొనసాగాలి’ అని చంద్రబాబు తన పోస్టులో ఆకాంక్షించారు. భారత రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల్లో నితీశ్ ఒకరని, బీహార్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు.
Latest News