|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 03:14 PM
బహ్రెయిన్‌లోని అమెరికన్ నావల్ బేస్‌పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన సుమారు 50 వేల మంది వరకు అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బహ్రెయిన్‌లోని ప్రవాస తెలుగువారి యోగక్షేమాలని అయ్యన్నపాత్రుడు అడిగి తెలుసుకున్నారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్‌లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఆరా తీశారు.ముఖ్యంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వారు అనేకమంది ఉపాధి నిమిత్తం బహ్రెయిన్‌లో స్థిరపడ్డారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నాతవరానికి చెందిన ఎన్నారై శెట్టి సతీశ్‌కు ఇవాళ(ఆదివారం) స్వయంగా ఫోన్ చేసి, అక్కడి తెలుగువారి యోగక్షేమాలను అయ్యన్నపాత్రుడు అడిగి తెలుసుకున్నారు. బహ్రెయిన్‌లో ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని దిశానిర్దేశం చేశారు.ఎలాంటి ఆపద వచ్చినా ఏపీఎన్ఆర్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని అయ్యన్నపాత్రుడు భరోసా ఇచ్చారు.
Latest News