|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 03:15 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను గాయం నుంచి కోలుకుంటున్న తరుణంలో ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.ఇటీవల ఏపీ ప్రజాప్రతినిధుల కోసం నిర్వహించిన క్రీడా పోటీల్లో భాగంగా రఘురామకృష్ణరాజు క్రికెట్ ఆడారు. ఆ సమయంలో ఆయన ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.. రఘురామకృష్ణరాజుకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని విచారించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు స్పందిస్తూ, "నా ఎడమ చేతి మణికట్టుకు జరిగిన శస్త్రచికిత్స అనంతరం, నా ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా విచారించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Latest News