విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: చంద్రబాబు
 

by Suryaa Desk | Wed, Mar 11, 2026, 02:24 PM

గడిచిన 20 నెలల్లో పాలనలో కీలకమైన మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చాం. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలి. ‘‘ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తాం. గత పాలనలో ట్రూఅప్‌ పేరిట విద్యుత్‌ ఛార్జీల భారం వేస్తే.. మేం ట్రూడౌన్‌ చేశాం. రాబోయే రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు మరింత తగ్గిస్తాం’’ అని తెలిపారు.ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. అధికారులు-ప్రజాప్రతినిధుల కార్యక్రమాలపై సీఎం కార్యాచరణ ప్రకటించారు.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM