వీసా గడువు మరో 30 రోజులు పెంపు,,,,యుద్ధం వేళ విదేశీయులకు భారత్ భారీ ఊరట
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 07:27 PM

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయి.. భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులకు భారీ ఊరటనిచ్చింది. దేశంలో ఉన్న విదేశీ పౌరుల వీసా గడువును మరో 30 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.


దుబాయ్‌లోని భారత కాన్సులేట్ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. భారత్‌లో ఉండిపోయిన విదేశీయుల ఈ-వీసాలు లేదా రెగ్యులర్ వీసాల గడువు ముగిసినా.. వాటిని ఉచితంగా మరో నెల రోజుల పాటు పొడిగించనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ తర్వాత యుద్ధం కారణంగా అనివార్యంగా భారత్‌లో ఉండిపోయిన విదేశీయులకు ఎటువంటి పెనాల్టీలు విధించరు. విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమైన తర్వాత.. వారు తమ స్వదేశాలకు వెళ్లడానికి అవసరమైన 'ఎగ్జిట్ పర్మిట్లను' కూడా ఎలాంటి రుసుము లేకుండా జారీ చేస్తారు. ఒకవేళ విదేశీ విమానాలు దారి మళ్లించి భారత్‌కు రావాల్సి వస్తే.. ఆ ప్రయాణికులకు 'టెంపరరీ ల్యాండింగ్ పర్మిట్' కూడా ఉచితంగా ఇస్తారు.


మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారత పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఖతార్ గగనతలం పాక్షికంగా మాత్రమే తెరిచి ఉండటంతో పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. ఖతార్ ఎయిర్‌వేస్ ద్వారా దాదాపు 500 మంది భారతీయులు కొచ్చి సహా ఇతర ప్రాంతాలకు చేరుకున్నారు. పలు కారణాలతో మరణించిన ఇద్దరు భారతీయుల మృతదేహాలను కూడా మానవతా దృక్పథంతో ఖతార్ ఎయిర్‌వేస్ ఉచితంగా స్వదేశానికి చేరవేసింది. మార్చి 14వ తేదీన ముంబైకి ప్రత్యేక విమానాన్ని నడపనున్నట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.


యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి ప్రాంతంలో రవాణా స్తంభించడంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.


Latest News
College student dies by suicide in Karnataka after being 'linked' to lecturer Thu, Apr 02, 2026, 12:50 PM
Fresh protests in Malda day after 7 Judicial Officers held hostage by protestors over name deletion Thu, Apr 02, 2026, 12:48 PM
J&K CM thanks Union Minister for extending PMGSY-I timeline till March 2027 Thu, Apr 02, 2026, 12:47 PM
Lokesh meets PM Modi, thanks him for passing Amaravati Bill Thu, Apr 02, 2026, 12:43 PM
Illegal LPG racket busted in Delhi's Palam; three arrested, 45 cylinders seized Thu, Apr 02, 2026, 11:39 AM