ఆ రాష్ట్రానికి చెందిన ఆటగాడు జట్టులో ఉంటే.. ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌కు ఓటమి లేదు!
 

by Suryaa Desk | Mon, Mar 16, 2026, 10:06 PM

India ICC Finals: టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 8న Ahmedabadలో జరిగిన ఫైనల్‌లో New Zealand national cricket teamపై 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.ఈ విజయంతో India national cricket team వరుసగా రెండోసారి (2024, 2026) టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా మూడోసారి (2007, 2024, 2026) పొట్టి ప్రపంచకప్ గెలిచిన భారత్.. స్వదేశంలో ఈ ట్రోఫీని అందుకున్న తొలి జట్టుగా మరో రికార్డును కూడా నమోదు చేసింది.అయితే భారత క్రికెట్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన విషయం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. జట్టులో Keralaకు చెందిన ఆటగాడు ఉన్నప్పుడు భారత్ ఇప్పటివరకు ఏ ప్రపంచకప్ ఫైనల్‌లోనూ ఓడిపోలేదనే గణాంకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఎస్ శ్రీశాంత్ ఈ ప్రత్యేక రికార్డు మొదటిసారి 1983 వన్డే వరల్డ్ కప్ సమయంలో కనిపించింది. ఆ టోర్నీలో భారత జట్టులో కేరళకు చెందిన Sunil Valson సభ్యుడిగా ఉన్నాడు. ఆ ఫైనల్‌లో భారత్ విజయం సాధించి తొలి సారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది.తర్వాత 2007 టీ20 వరల్డ్ కప్‌లో కేరళ ఫాస్ట్ బౌలర్ S. Sreesanth జట్టులో భాగమయ్యాడు. ఆ టోర్నీలో కూడా భారత్ విజయం సాధించింది. అదే విధంగా 2011 వన్డే ప్రపంచ కప్‌లో కూడా శ్రీశాంత్ జట్టులో ఉండగా భారత్ మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.సంజు శాంసన్ ఇటీవల జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్‌లో కేరళకు చెందిన వికెట్‌కీపర్ బ్యాటర్ Sanju Samson భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో భారత్ టైటిల్ గెలుచుకుంది. అలాగే 2026 టీ20 వరల్డ్ కప్‌లో కూడా సంజు జట్టులో ఉండగా భారత్ మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.ఈ విధంగా కేరళకు చెందిన ఆటగాడు జట్టులో ఉన్న ప్రతీసారి ప్రపంచకప్ ఫైనల్లో భారత్ విజయం సాధించడం విశేషంగా మారింది. దీంతో ఇది యాదృచ్ఛికమా? లేక నిజంగా అదృష్టమా? అన్నదానిపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
*ప్రపంచకప్‌లలో కేరళకు చెందిన ఆటగాళ్లు
-1983 వన్డే వరల్డ్ కప్ – Sunil Valson
-2007 టీ20 వరల్డ్ కప్ – S. Sreesanth
-2011 వన్డే వరల్డ్ కప్ – S. Sreesanth
-2024 టీ20 వరల్డ్ కప్ – Sanju Samson
-2026 టీ20 వరల్డ్ కప్ – Sanju Samson

Latest News
IPL 2026: Aakash Chopra picks RCB XI, leaves out Bethell, Iyer Fri, Mar 27, 2026, 01:29 PM
'Should become Delivery Chief Minister': SP chief Akhilesh takes jibe at UP Dy CM Fri, Mar 27, 2026, 12:53 PM
Ram Navami celebrations underway in Patna with devotion, grandeur; Nitin Nabin prays at Mahavir Temple Fri, Mar 27, 2026, 12:36 PM
Five of family killed, five people injured as SUV crashes into autorickshaw in Gwalior Fri, Mar 27, 2026, 12:34 PM
Modi govt's decision to cut excise duty on fuel brings much-needed relief to citizens: Amit Shah Fri, Mar 27, 2026, 12:32 PM