|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 10:55 AM
బొబ్బిలి నియోజకవర్గంలో పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. నాలుగు మండలాలు, పట్టణ పరిధిలోని సుమారు 600 కుటుంబాలకు గోధుమపిండి, బియ్యం, పంచదార, సేమ్యా, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి ఉన్న కిట్లు అందజేశారు. గత ఐదేళ్లుగా ప్రతి రంజాన్‌కు ఈ సహాయం అందుతున్నదని ముస్లిం సోదరసోదరీమణులు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News