|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 12:27 PM
మూత్రంలో రక్తం పడటం కేవలం ఇన్ఫెక్షన్ వేడి వల్ల జరిగేది కాదని వైద్యులు వివరిస్తున్నారు. ఇది మూత్రాశయ క్యాన్సర్‌కు తొలి హెచ్చరిక కావచ్చని యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ యూరాలజీ కాంగ్రెస్‌లో సమర్పించిన అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 8,500 మందిపై జరిపిన ఈ పరిశోధనలో, మూత్రంలో రక్తంతో వచ్చే ప్రతి నలుగురిలో ఒకరికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉందని తేలింది. సకాలంలో నిర్ధారణ పరీక్షలు జరగకపోతే, 90 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో పురుషులలో వచ్చే క్యాన్సర్లలో మూత్రాశయ క్యాన్సర్ 9వ స్థానంలో ఉంది.
Latest News