|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 04:01 PM
దేవనకొండ మండలం కప్పట్రాళ్ళ గ్రామంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ దంపతులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. వేదమంత్రాల నడుమ జరిగిన పూజల్లో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పురోహితులు వెంకటరమణ, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Latest News