|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 04:07 PM
రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులు కూడా వీస్తాయని, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండి, ఆ తర్వాత క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలోనూ రాగల మూడు రోజులు ఇదే వాతావరణం కొనసాగి, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని తెలిపింది.
Latest News