|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 12:58 PM
ఉదయం లేవగానే కళ్ల చుట్టూ వాపు కనిపించడం సాధారణమే అయినప్పటికీ, ఇది కొెందరిలో తీవ్ర ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలు బలహీనపడితే రక్తంలోని ప్రోటీన్ మూత్రంలోకి వెళ్లి, శరీరంలో ద్రవం చేరి కళ్ల చుట్టూ వాపునకు దారితీస్తుందంటున్నారు. తగినంత నిద్ర లేకపోవడం, అలర్జీలు, ఎక్కువ ఉప్పు, డీహైడ్రేషన్ వంటి తాత్కాలిక కారణాల వల్ల కూడా వాపు రావచ్చు. అయితే, మూత్రంలో నురుగు, కాళ్లు, మడమల వాపు, అలసట, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Latest News