|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 01:52 PM
గుంటూరు జీజీహెచ్ నుండి రిమాండ్ ఖైదీ అజిత్ కుమార్ పరారీ అయినట్లు సమాచారం. గతంలో తెనాలి వన్ టౌన్ పీఎస్ పరిధిలో అజిత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి, ఒక కేసు నిమిత్తం రేపల్లె సబ్ జైలుకు తరలించారు. అనారోగ్య కారణాలతో మూడు రోజుల క్రితం అతన్ని జీజీహెచ్ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. నిందితుడు గతంలో ఒంగోలులో కూడా పోలీసుల కళ్లుగప్పి పరారీ అయినట్లు తెలుస్తోంది. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Latest News