IPL 2026: MI ప్లాన్స్‌కు బ్రేక్.. బుమ్రా సహా కీలక ప్లేయర్లు డౌట్
 

by Suryaa Desk | Sat, Mar 28, 2026, 10:18 PM

MI - IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ (ఎంఐ)కు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనున్న తొలి మ్యాచ్‌కు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. స్టార్ పేసర్ Jasprit Bumrahతో పాటు విదేశీ ఆల్‌రౌండర్లు Will Jacks, Mitchell Santner అందుబాటులో ఉండడంపై అనుమానాలు నెలకొన్నాయి.రిపోర్టుల ప్రకారం.. ఈ ముగ్గురు ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ నిర్వహించిన తప్పనిసరి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. దీంతో వారి ఫిట్‌నెస్, అందుబాటు విషయాలపై సందేహాలు మరింత పెరిగాయి. అయితే బుమ్రా మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఉన్నప్పటికీ, అతను జట్టుతో ఎప్పుడు కలుస్తాడన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇటీవల అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.ఇక న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. మరోవైపు విల్ జాక్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ అనంతరం ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడు. ఈ ఇద్దరూ ముంబై జట్టుతో ఎప్పుడు చేరతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. షెర్ఫాన్ రదర్‌ఫోర్డ్, అల్లాహ్ ఘజన్‌ఫర్ లేదా కార్బిన్ బోష్‌లకు తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కే అవకాశం ఉంది. ఆసక్తికరంగా, రదర్‌ఫోర్డ్ మరియు ఘజన్‌ఫర్ గతంలో కోల్‌కతా జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.ఇదిలా ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టూ గాయాల సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ ఇప్పటికే టోర్నమెంట్‌కు దూరమవగా, శ్రీలంక పేసర్ మతీష పతిరణ ఇంకా జట్టుతో చేరలేదు.ఈ నేపథ్యంలో రెండు జట్లు గాయాల సమస్యలతోనే తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి. కీలక ఆటగాళ్ల గైర్హాజరు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముంబై–కోల్‌కతా మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest News
Awadhesh Narain Singh turns emotional as Nitish Kumar resigns from MLC post Mon, Mar 30, 2026, 02:03 PM
AIUDF chief Ajmal criticises CM Sarma, predicts BJP's defeat in Assam polls Mon, Mar 30, 2026, 01:46 PM
Delhi L-G Sandhu reviews Bhalswa landfill, pushes for faster bioremediation, waste segregation Mon, Mar 30, 2026, 01:07 PM
Rohit's 2.0 avatar will worry all IPL teams: Kumble Mon, Mar 30, 2026, 12:59 PM
CSK players don't roam as 5-time champions; happy to be a part of that culture: Samson Mon, Mar 30, 2026, 12:59 PM