|
|
by Suryaa Desk | Mon, Mar 30, 2026, 11:53 AM
ఆర్థిక సంక్షోభంతో పాటు, పాకిస్తాన్ తీవ్రమైన ఇంధన కష్టాలను ఎదుర్కొంటోంది. ఫారెక్స్ నిల్వలు తగ్గడంతో దిగుమతులు కష్టంగా మారాయి. దీనిని అధిగమించడానికి, షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం రాబోయే 2 వారాల పాటు అన్ని పాఠశాలలను మూసివేసింది. విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల రవాణాకు ఉపయోగించే ఇంధనాన్ని ఆదా చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ను తప్పనిసరి చేశారు. స్మార్ట్ లాక్‌డౌన్ ద్వారా అనవసర రవాణాను నిషేధించి ఇంధన సరఫరాను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు.
Latest News