|
|
by Suryaa Desk | Mon, Mar 30, 2026, 03:11 PM
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 2.50 లక్షల గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా కర్నూలులోని జోహారాపురంలో సోమవారం గృహప్రవేశ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీ. జీ. భరత్, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు. లబ్ధిదారులైన నజీబున్నిస బేగం, షేక్ గౌస్ బాషాల నివాసాల్లో మంత్రి, కలెక్టర్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం తరఫున కొత్త బట్టలను బహూకరించారు. ప్రభుత్వం అందిస్తున్న గృహాలు పేదల జీవితాల్లో స్థిరత్వం తెస్తాయని మంత్రి టీజీ భరత్ అన్నారు.
Latest News