|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 11:38 AM
ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతమున్న వార్షిక పాస్ ధర 2.5% పెరిగి రూ. 3,000 నుంచి రూ. 3,075కు చేరనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ కొత్త టోల్ రేట్లు వర్తిస్తాయి. ఈ పాస్ ఒక ఏడాది పాటు లేదా గరిష్టంగా 200 టోల్ క్రాసింగ్‌లకు మాత్రమే అనుమతిస్తుంది. ఈ పెంపుతో దాదాపు అర కోటికి పైగా వాహనదారులపై ఆర్థిక ప్రభావం పడనుంది. మోడీ ప్రభుత్వం టోల్ రుసుములను ప్రతి ఏటా సమీక్షించడంలో భాగంగానే ఈ స్వల్ప పెంపు చేసినట్లు పేర్కొంది.
Latest News