|
|
by Suryaa Desk | Fri, Apr 03, 2026, 09:58 PM
పార్లమెంట్ తాజాగా పబ్లిక్ ట్రస్ట్ (సవరణ) బిల్లు, 2026ను ఆమోదించింది. ఈ సవరణలతో 79 కేంద్ర చట్టాల్లోని మొత్తం 784 సెక్షన్లలో మార్పులు చేశారు. ముఖ్యంగా వెయ్యికి పైగా చిన్న నేరాలను నేరరహితంగా మార్చారు.అంటే ఇకపై చిన్న తప్పిదాలకు జైలుశిక్ష విధించే పరిస్థితి ఉండదు. వాటికి బదులుగా జరిమానా లేదా హెచ్చరికలతోనే పరిమితం అవుతాయి. కోర్టులపై భారాన్ని తగ్గించడం, ప్రజలు చిన్న విషయాలకే న్యాయపరమైన ఇబ్బందులు పడకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది పరిపాలనను సులభతరం చేయడంలో కూడా సహాయపడనుంది.మెట్రోలో సిగరెట్ తాగితే..? మెట్రోలు లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో మొదటిసారి సిగరెట్ తాగితే ఇకపై జైలుశిక్ష ఉండదు. అలాంటి సందర్భాల్లో జరిమానా లేదా వార్నింగ్‌తోనే విడిచిపెడతారు. అదే తప్పును పదే పదే చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.వాయు, శబ్ద కాలుష్యానికి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినా మొదటి తప్పిదానికి ఫైన్ మాత్రమే విధిస్తారు. అయితే పునరావృతం అయితే కఠిన శిక్షలు తప్పవు. ఈ మార్పుల వల్ల న్యాయవ్యవస్థపై ఒత్తిడి తగ్గి, కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత చిన్న నేరాల కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అలాంటి కేసులను గుర్తించి కోర్టుల్లో ఉపసంహరణ కోసం దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది. దేశవ్యాప్తంగా సుమారు 5 కోట్ల చిన్న కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో చాలా వరకు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేనివేనని ప్రభుత్వం భావిస్తోంది.
*ప్రధాన మార్పులు:
-57 సెక్షన్లలో జైలుశిక్ష పూర్తిగా రద్దు
-158 సెక్షన్లలో జరిమానా తగ్గింపు
-17 కేసుల్లో శిక్షలను తగ్గింపు
-113 కేసుల్లో జైలు శిక్ష, జరిమానా బదులుగా కేవలం శిక్ష మాత్రమే విధింపు