|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 10:51 AM
AP: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త చెప్పారు. వారికి చెల్లించాల్సిన రూ.900 కోట్లను ఏప్రిల్ నుంచి జూన్ వరకు విడతల వారీగా చెల్లిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన, జూన్ నాటికి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పురోగతిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, ఇప్పటికి 70% హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.
Latest News